08 March 2011

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ మనసు:
నువ్వు మొదటిసారి గర్భాన కదలినపుడు పరమానందం కలిగింది.
-నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.
-ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.
-నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.
-అందరికంటే బలవంతుడివవ్వాలని!
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.
-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.
-గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.
-నేను లేకపోయినా బ్రతకగలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.
-నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది.
-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!
ఇది చదివినప్పుడల్లా ఎందుకో నాకు అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి.....!