21 September 2011

ఆధునిక సాహిత్యానికి.. అడుగు జాడ... మన గురజాడ 150వ జన్మదినోత్సవం

గురజాడ అప్పారావు
ఆధునికాంధ్ర సాహిత్యానికి దిశా నిర్దేశం చేస్తూ దీపధారియై ముందు నడుస్తూ  అడుగు జాడ గురజాడది అనిపించుకున్న గురజాడ సాహితీపరులందరికీ చిరస్మరణీయుడు.
 

దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్...

వట్టిమాటలు కట్టి పెట్టోయ్...  గట్టిమేల్ తలపెట్టవోయ్....
అంటూ దేశ ప్రజను జాతీయ దృక్పదంతో ఉద్బోధిస్తూ  రాసినగేయం ఏదేశప్రజలైనా పాడుకోదగ్గది. 
ఇలాంటి దేశభక్తి గేయం మరో బాషలో ఉండదనుకున్న అతిశయోక్తి కాదనిపిస్తుంది.

ఆయన సమాజంలోఉన్న మూఢవిశ్వాసాల్ని డంబాచారాల్ని తోకచుక్క అనే గేయంలో  కడిగివేశారు.  ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు. 
 
 

గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.  విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్  21 అప్పారావు జన్మించాడు.  తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లిలో పదేళ్ళ వరకు చదివాడు..
 
అతడు తన హైస్కూలు చదువుల రోజులలోనే శ్లోకాలు వ్రాసేవాడట. కాలేజీ లో అడుగు పెట్టిన కొత్తల్లోనే (21వ ఏట) సారంగధర అన్న ఇంగ్లీషు పద్యకావ్యాన్ని ప్రచురించిన ధీశాలి.  అప్పట్లోనే చంద్రహాస అన్న మరో ఇంగ్లీషు కావ్యాన్నికూడా వ్రాసేడు.  సారంగధర కావ్యం ఎంత పేరుపొందిందంటే ఆ ప్రచురిత కావ్యాన్ని  ప్రముఖ కలకత్తా పత్రిక తిరిగి తమ పత్రికలో ప్రచురించేటంత. అయితే వీటినీ, ఆతరువాత కొన్ని సంస్కృత నాటకాలకి ఆంగ్లంలో వ్రాసిన పీఠికలనుగానీ ఆ కవిశేఖరుని ఆంగ్ల భాషా వైదుష్యానికి  మచ్చుతునకలనవచ్చునేమో గానీ ఆయనకి చిరకీర్తిని తెచ్చి పెట్టినది మాత్రం తెలుగు లో మాగ్నమ్ ఆపస్ ( Magnum opus ) అనదగ్గ  కన్యాశుల్క నాటక రచన మాత్రమే..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని సుమారు 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు .  ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు..

1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు --- సమాజ, సాహితీపరుల ఆమోదపు ప్రోత్సాహంతోనూ కన్యా శుల్కం నాటకాన్నితిరగ రాసి  ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది 
 
ఇతర రచనలు
సారంగధర (ఇంగ్లీషు పద్య కావ్యం-ఇండియన్ లీజర్ అవర్ (విజయనగరం) లోనూ రీస్ అండ్ రయ్యత్ (బెంగాల్) పత్రిక లోనూ ప్రచురించబడింది)పూర్ణమ్మ,  కొండుభట్టీయం,     నీలగిరి పాటలు ,ముత్యాల సరాలు,     కన్యక,     సత్యవ్రతి శతకము,     బిల్హణీయం (అసంపూర్ణం),     సుభద్ర,     లంగరెత్తుము,     దించులంగరు,     లవణరాజు కల,     కాసులు, సౌదామిని,   కథానికలు,       దిద్దుబాటు,     మెటిల్డా,   సంస్కర్త హృదయం,  మతము-విమతము.
ఆయన రచనలు రాశిలో తక్కువైనా, వాసికెక్కిన రచనలాయనవి. 

1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.  1886 లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.

 గురజాడ శాసన పరిష్కర్త, సాహితీవేత్త, భాషా శాస్త్రవేత్త కూడా. గిడుగు రామ్మూర్తిగారితో (విజయనగరంలో చదువుతున్నపుడు నుండి మంచి స్నేహితులు) కలిసి పలు ప్రాంతాలలో చర్చలలో పాల్గొనడం, గ్రాంథిక భాష వాడుక లోపాల్ని చెప్పడంతో బాటు, వ్యవహారిక భాషలో రచనలు చేయడం వల్ల లాభాల్ని వివరిస్తూ, అంతటితో వూరుకోకుండా విశ్వవిద్యాలయాల్లో బోధనా భాషగా వ్యవహారిక భాష ఉండాలని ఉద్యమరీతిలో కృషి చేశారు. 
 
ఆరోగ్యం బాగోకపోయినా (53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు) 52సంవత్సరాల లోపలే ఇన్ని కార్యక్రమాల్ని నిర్వహించారు. సంకల్పబలం ఉంటే తీరిక లేకపోయినా, ఆరోగ్యం బాగుండకపోయినా గొప్ప గొప్ప పనుల్ని ఒంటరిగా, అవలీలగా నిర్వహించవచ్చని నిరూపించారు గురజాడ వేంకట అప్పారావు.

18 September 2011

తెలుగు బ్లాగర్లకి గౌరవ సూచన విజ్ఞప్తి..!

కవులు - రచయితలు,  పెద్దలు - ఆదర్శులు,
యువకులు  - యువతీయులు,   మహిళలు  - మేధావులు 
అందరికి భాషాబివందనాలు..! 

వ్యక్తులు, వ్యక్తిత్వాలు, వ్యవస్థలు, చరిత్రలు,  సాహిత్య , సాంకేతిక,  సమాజ హితమైన సలహాలు సూచనలతో వివిధ / విశేష  సందర్భాలలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ  అవగాహన, చైతన్య పరుస్తున్నారు.....  
మన తల్లి భాష యైన  " తెలుగు "
తెలుగు భాష - యాస,  సంస్కృతి - సాంప్రదాయ,  జనపద - జానపద  జాతి - సాహిత్య విషయాలను  చర్చిస్తూ - పోస్ట్ చేస్తూ ....

తెలుగు  భాష - జాతి   అభివృద్ధికి  కృషి  చేయాలని  
తెలుగు  రక్షణ  వేదిక 
తెలుగు బ్లాగర్లకి గౌరవ సూచనా విజ్ఞప్తి చేస్తుంది.....!

ధన్యవాదాలు .మీ. 
పొట్లూరి హరికృష్ణ - 99 080 57 895.

17 September 2011

సర్దార్ పటేల్ V/s నిజాం = హైదరాబాదు రాజ్య విమోచనం..!

భారత దేశానికి   1947ఆగస్టు  15న స్వాతంత్ర్యం  వచ్చినది.   స్వాతంత్ర్యం తర్వాత  స్వల్ప వ్యవధిలోనే  ఎలాంటి  హింస  రక్తపాతం లేకుండా  534 రాచరిక  సంస్థానాలు  దేశంలో ఐఖ్యమై భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినది.  కానీ నిజాం పాలనలోని  హైదరాబాదు  రాజ్య  ప్రాంతం (  హై.బా రాజ్య విస్తీర్ణం-- 82.7 వేల చదరపు మైళ్ళు) భారత  ప్రభుత్వం లో కలవలేదు.  

కలవక పోగా మరో వైపు   7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఆదేశాలతో  ఖాసిం రజ్వీ  సైన్యాలు  తెలంగాణా ప్రాంతంలో రాయడానికి వీలుకాని  అంత అరాచకం సృష్టించారు.  ఆ సందర్భంలో కమ్యునిస్టు పార్టీ నాయకత్వంలో దళాలు , సంఘాలు మరియు సమరయోధులు నిజాం రజాకార్ల  సైన్యాన్ని ఎదురిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నారు.

ఈ  క్రమంలో  భారత  ప్రభుత్వం   సర్దార్ వల్లభాయ్
పటేల్ ఆదేశాలతో  సైన్యం " ఆపరేషన్ పోలో " పేరుతో  1948 సెప్టెంబరు   13న   నిజాం హైదరాబాదు  రాజ్యంలో  కదం తొక్కాయి. రాజ్యన్ని నలువైపుల  నుంచి సైన్యం చుట్టూ ముట్టారు.  సైన్యాలతో పోరాడలేక  1948 సెప్టెంబరు 17న  నిజాం ప్రభువు  మీర్ ఉస్మాన్ ఆలీఖాన్  భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.   బొల్లారంలోని  ప్రస్తుత  రాష్ట్రపతిభవన్ లో  నిజాం  సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదుట  లొంగిపోయాడు.




చిత్రం లో

సర్దార్ పటేల్
జీకి

నమస్కరిస్తున్న

నిజాం నవాబు

మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ .





భారత  గవర్నర్ జనరల్  హిస్  ఎక్స్ లెన్సీ   రాజ గోపాలాచారి ఆదేశాల మేరకు నా ప్రభుత్వం  రాజీనామా చేసింది అని  రేడియోలో ప్రకటించాడు. ఈ విలీన కార్యక్రమం  సర్దార్ వల్లభాయ్ పటేల్  సమక్షంలో జరిగింది.   ఈ విలీనం తో  సంపూర్ణ భారతదేశం ఏర్పడినది. 
కర్ణాటకలోని కొన్ని జిల్లాల లో   ( హైదరాబాద్  కర్ణాటక ప్రాంతం )   సెప్టెంబరు 17ను  విమోచన దినాచరణ 1948 నుంచి  జరుగుచున్నది. 

16 September 2011

మనసుతో పనిలేని ఓ యంత్రమా ఈ తెలుగు వాడు ..?

ఏ జాతి  సమస్త వ్యవహారాలూ ఆ జాతి మాతృభాషలో జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.ఎప్పటికి అది విజేతగానే ఉంటుంది. ఆంగ్లేయులను వాళ్ళ దేశాలను పరిశీలిస్తే దురాక్రమణత్వం వల్ల భౌతిక సంపదలు సమకురాటమేకాక వారి భాష కూడా వాళ్ళ ఆక్రమించిన దేశాల్లో రాజ్యం ఏలింది . ఏలుతున్నది. తమ జీవితంలో అన్ని రంగాల్లో తమ మాతృభాషా వాడుకంలో ఉండేలా  వాళ్ళు కృషి చేస్తారు , ఇంట్లో , ఆఫీసులో , కోర్టులో చివరికి చర్చిలో కుడా వాళ్ళు మాతృభాషలోనే  వ్యవహారాలూ నడుస్తాయి . కాబట్టే వారి భాష వారు సుఖపడుతున్నారు. 

తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్న , ఆఫీసులో ఇంగ్లీష్ , కోర్టులో  ఇంగ్లీష్ , కొన్ని ప్రాంతాల్లో హింది లేదా ఉర్దూ మాట్లాడల్సివస్తుంది . చివరికి దేవుడి ప్రార్థన చేసుకుందామన్న సంస్క్రుతంలోనో , అరబ్బీ లోనో  చేసుకోవలసివస్తుంది . తెలుగు మనిషి  మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు .   తెలుగు  క్రైస్తవులు తమ ఆద్యాత్మిక వ్యవహారాలన్ని తెలుగులోకి మార్చుకోవడం వల్ల కనీసం మానసిక ఆనందాన్ని పొందగలుగుతున్నాడు.  తెలుగు  హిందువులు ,  తెలుగు ముస్లీంలు  మొదట తమ ఆద్యాత్మిక వ్యవహారాలను తెలుగులోకి మార్చుకోగలిగితే  తెలుగు హృదయం స్వేచ్చగా  పలుకుతుంది. దేవునితో మాట్లాడే భాష హొదా తెలుగుకు వస్తుంది.  ఆ ఆనందం వర్ణించలేనిదీ.

పూర్వ కాలంలో  మన  దేశంలోని   రాజులు  చక్రవర్తులు  తమ  తమ  మాతృ  భాషలలో  ప్రజలతో సంభాషించేవారు. ఆలాగే   ధైనందిన జీవిత వ్యవహారాల  పరిష్కారాల  విషయంలో కుడా మాతృభాషనీ ఉపయోగించడం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది .  ప్రజల భాషలోనే  కుడా రాజ్యపాలన సాగింది . ఎవరైనా  భాధితుడు  వచ్చి ధర్మ గంటను మ్రోగిస్తే ,  రాజు విచ్చేసి భాధితుడి   మొర  విని నిందితుడ్ని పిలిపించి  అందరి సమక్షంలో విచారించేవాడు.  అ విచారణలో  ఇరు పక్షాలు వాదోపవాదాలు  మాతృ భాషలో జరిగేవి.  తీర్పురి  అయన రాజుగారికి  ఫిర్యాది  - నిందితుడికి   మద్య మధ్యవర్తిగా  ఎ ''ప్లీడరు'' వుండేవాడు కాదు. 

రాజు విచారణ జరిగేటప్పుడు  ప్రజల  భాషలోనే   ప్రశ్నించి  వివాద  మర్మాన్ని  పసిగట్టేవాడు.  చివరకు ప్రజల భాషలోనే  తీర్పు   ప్రకటించే వాడు.  ఈ మేరకు అటు విచారణ  ఇటు తీర్పు   ప్రజల సొంత భాషల్లొ జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది  కాదు.  తీర్పు సొంత భాషలో రావడంతో పిర్యాదునికిగాని, నిందుతుడుకిగాని  అర్థం కానిదంటు ఎమి వుండేది  కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన  విధానంతో ఆనాటి పద్దతులను  పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది .

14 September 2011

తెలుగు సతతము వెలుగు(ని)రా ..!

తెలుగురా.. ఇది తెలుగురా...
తెలుగు సతతము వెలుగు (ని) రా ...!

చండ్రనిప్పుల  తాండ్ర  పాపయ 
గండ్ర గొడ్డలి పదునురా            
!! తెలుగురా !!

భద్రకాళిని  బోలు రుద్రమ్మ 
శౌర్య చంద్రిమ రూపురా            
!! తెలుగురా !!

పోరుసలిపిన  వీరుడు అల్లూరి 
నిశినిశిత శరమ్మురా               
!! తెలుగురా !!

మంట గురిసిన  మహాకవి  శ్రీశ్రీ
కవితారా                              
!! తెలుగురా !!

గుండు కెదురుగా గుండె నిలిపిన ప్రకాశం 
ధైర్యమ్మురా                            
!! తెలుగురా !!

బద్దకస్తుల నిద్దురను పోగొట్టు గద్దరు 
గళమురా..                         
!! తెలుగురా !!

12 September 2011

తెలుగు ''సుప్రీం'' న్యాయమూర్తిగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్..!

సుప్రీం కోర్టులో  ఐదుగురు  న్యాయమూర్తుల నియామక పక్రియ జరిగింది, 
ఆ ఐదుగురులో  మన తెలుగువాడు జస్టిస్   '' జాస్తి చలమేశ్వర్ '' కూడా ఉన్నారు.

ఆయన 1953జూన్ 23న కృష్ణ జిల్లా లోని మొవ్వ మండలం పెదముత్తేవి లో లక్ష్మి నారాయణ, అన్నపూర్ణాదేవి దంపతులకు  జన్మించారు. బార్య లక్ష్మినళిని , ముగ్గురు కుమారులు వెంకట రామ్ భూపాల్, నాగ భూషణ్, లక్ష్మి నారాయణ ఉన్నారు.

 జాస్తి లక్ష్మినారాయణ మచిలీపట్నంలో న్యాయవాదిగా  పనిచేస్తున్న కాలంలో హిందు హైస్కూల్  జస్టిస్  ''జాస్తి చలమేశ్వర్'' పీ.యూ.సీ వరకు చదివారు. మద్రాసు లయోలా కాలేజీలో బీఎస్పీ (పిజిక్స్) చదివారు. 1976లొ విశాకలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్.ల్.బీ పూర్తిచేశారు. అదే ఏడాది బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

జస్టిస్ గారికి  రాజ్యాంగ, ఎన్నికల, సెంట్రోల్  ఎక్సైజ్ , కస్టమ్స్ , ఐటీ, క్రిమినల్ చట్టాల్లో మంచి ప్రావీణ్యమ్ ఉంది. 1985-1986లో రాష్ట్ర లోకాయుక్త స్టాండింగ్ కౌన్సిల్ గా వ్యవహరించారు.  1988-1989లో  ప్రభుత్వ న్యాయవాది (హూంశాఖ వ్యవహారాలు) గా నియమితులయ్యారు. 1995లో సీనియర్ న్యాయవాదులయ్యారు.  1997జూన్ 23న పుట్టిన రోజునే రాష్ట్ర  హైకోర్ట్ అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు  స్వీకరించారు.  1999మే 17న పూర్తి  స్థాయి  న్యాయమూర్తిగా బాధ్యతలు  చేపట్టారు. 2007మే  3   న గౌహతి హైకోర్ట్ చీఫ్  జస్టిస్  గా పదోన్నతిపై  వెళ్లారు.  2010మార్చి  17నుంచి  కేరళ  హైకోర్ట్  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు  చేపట్టారు. . పాడిపంటలన్న  ప్రతేక అభిమానం. జస్టిస్   గారు ఏటా రెండు మూడు సార్లు పెదముత్తేవి వచ్చి తన పొలాలను స్వయంగా పర్యవేక్షించేవారు.   
 
తెలుగువారు సుప్రీం కోర్టులో న్యాయముర్తులుగా పనిచేసినవారు జస్టిస్ పి.సత్యనారాయణ, జస్టిస్ పి.జగన్ మోహన్ రెడ్డి , జస్టిస్  ఓ.చిన్నపరెడ్డి , జస్టిస్  కే.రామస్వామి, జస్టిస్ కే. జయచంద్రా రెడ్డి, జస్టిస్ బి.పి.జీవనరెడ్డి, జస్టిస్  ఎం.జగన్నాథరావు,  జస్టిస్ పి.వెంకట రామారెడ్డి,  జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి సేవలు అందించడం. మనం గర్వించదగ్గ విషయమే. 

11 September 2011

జాతీయ స్థాయిలో తెలుగు వెలుగులు.!

ఏదేశంలోనైన  రాజకీయాలు అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి. ఎ ప్రాంతం వారి పాత్ర ఎంతని చెప్పడం కష్టం. చరిత్ర  కొన్ని బౌతిక కారణాల ద్వార ప్రభావితం అవుతుంటుంది. రాజకీయాలు చరిత్రలో భాగం. రాజకీయాలను కేవలం రాజకీయ నాయకులే ప్రభావితం చయనక్కర్లేదు. సాహిత్యం , సంస్కృతి , కళలు, ఉద్యమాలు మొదలైనవన్నీ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. తెలుగువారు విభిన్న రంగాలలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచారు. రాజకీయాలను కూడా ప్రభావితం చేసారు. 

తెలుగువారికి  విశిష్టమైన  అంశం  ఏమిటంటే  అంతర్జాతీయ స్థాయిలో  జరిగిన  పరిణామాలకు  దేశంలో మిగతా  వారందరి కంటే ముందు ప్రభావితమై స్పందించిన సందర్భాలు చాలా  ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో అభ్యుదయం మిగతా భాష సాహిత్యలకంటే ముందుగా జరిగింది. ఒక అభ్యుదయ విప్లవోద్యమాలే కాదు,  స్త్రీవాదం ముందుగా తెలుగు  సాహిత్యంలో చోటుచేసుకున్నట్లు కనపడుతుంది. దేశంలో వివిధ  ప్రాంతాలలో జరిగిన  ఉద్యమాలకు తెలుగువారు స్పందించి మరింత ముందుకు తెసుకేల్లిన సందర్భాలున్నాయి. బెంగాల్ లో ప్రారంభమైన సంఘ సంస్కరణొద్యమ ప్రభావం తెలుగు సాహిత్యంలో  కనపడుతుంది.  హిమాలయాలను వర్ణించిన అల్లసాని పెద్దన నుంచి - తాజ్ మహాల్  పడగోట్టండోయ్. రాయి రాయి  విడగోట్టండోయ్! అన్న ఆలూరి బైరాగి వరకూ తెలుగువారే. కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం వివిధ భాష  సంస్కృతులను ప్రభావితం చేసాయి.

దేశమంటే "మనుషు"లని జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు " నేను సైతం ప్రపంచాగ్నికి   సమిధ నోక్కటి....." అన్న శ్రీ శ్రీ. జ్ఞానపీట అవార్డు పొందిన విశ్వనాధ్ , సి.నా.రే తో పాటుమరెందరో తెలుగు రచయితలు జాతీయ సాహిత్యంలో స్థానం పాదించుకున్నారు. 
తెలుగు పాత్రికీయులు దేశరాజకీయాలను ప్రభావితం చేసేంత కీలక పాత్ర పోషించారు. సి.వై. చింతామణి, చలపతిరావు, కుందూరి ఈశ్వర్ దత్,  జి.కే. రెడ్డి ,  నార్ల వెంకటేశ్వరావులు జాతీయ స్థాయిలో  చేసిన  కృషి మరువలేం. 

స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్రను మనం గుర్తు చేసుకుంటే దేశ రాజకీయాలను  ప్రభావితం చేయగలిగింది అర్థం అవుతుంది.  అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా  భోగరాజు పట్టాభి సీతారమయ్య స్వతంత్ర సమరంలో  నిర్వహించిన పాత్ర  చరిత్ర  పుటల్లో రికార్డుయి ఉంది. ఆయన రచించిన భారత జాతీయ  కాంగ్రెస్  చరిత్ర  ఇప్పటికీ  కాంగ్రెస్   చరిత్రకు సంబంధించి  ప్రామాణిక  గ్రంధం.   ఎ.ఐ.సి.సి అద్యక్షుడైన కొండా వెంకటప్పయ్య కుడా ఆనాడే   తెలుగు వారి కోసం ప్రత్యెక రాష్ట్రం డిమాండు చేసేందుకు  మాంటేగ్-చేమ్స్ పర్డు  బృందాన్ని  కలిసారు.  

ఆంద్ర రాష్ట్ర  ప్రధమ ముఖ్యమంత్రి గా టంగుటూరి ప్రకాశం స్వాతంత్ర సమరంలో పాల్గొన్న తీరు , స్వరాజ్య పత్రిక సంపాదకుడుగా గాంధీజీ ప్రశంసలు అందుకున్న వైనం చరిత్రలో నిలిచిపోయింది.  జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య.  ఆంధ్ర పత్రిక  వ్యవస్థాపకులు కాశినాధుని నాగేశ్వరరావు , నైటింగేల్ అఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన సరోజినీ నాయుడు, ప్రముఖ తత్వశాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మరో  మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి,  పార్లమెంటులోనూ, ప్రజా ఉద్యమాలల్లోను  సమర్థమంతమైన పాత్ర పోషించిన  తెన్నేటి  విశ్వనాథం, జాతీయోద్యమంలో అగ్రశ్రేణి నాయకుడిగా గుర్తింపు పొందిన బాలగంగాధర్ తిలక్  పిలుపు ఇచ్చిన  హాంరూల్   ఉద్యమంలో పాల్గొన్న స్వామి రామాంద తీర్థ, రాజకీయ వేత్త, సాహిత్యవేత్త ,మాజీ కేంద్ర మంత్రి బెజవాడ గోపాలరెడ్డి , తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన      కవి ముఖ్దాం మొహియుద్దీన్, ప్రముఖ సంఘ సేవకురాలు  దుర్గాబాయ్ దేశ్ ముఖ్, కమ్యునిస్టు మార్క్రిస్టు పుచ్చలపల్లి సుందరయ్య , చండ్ర రాజేశ్వరరావు , గిరిప్రసాద్ , రావి నారాయణరెడ్డి , తరిమెల నాగిరెడ్డి , చేనేత రంగం కోసం జీవితాంతం కృషిచేసిన ప్రగడ కోటయ్య,  ప్రప్రధమ దళిత ముఖ్యమంత్రి , మాజీకేంద్ర మంత్రి  దామోదర్ సంజీవయ్య  ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లొ కీలక పాత్ర  పాత్ర   పోషించిన తెలుగు ప్రముఖులెందరి గురించో ప్రస్తావించవచ్చు. వీరిలో ఒక్కొక్కరి గురించి వివరించాలంటే అదొక చరిత్ర అవుతుంది. జాతీయ రాజకీయ పక్షాల అద్యక్షులుగా  భోగరాజు పట్టాభి సీతారమయ్య  నుంచి వెంకయ్య నాయుడు భాధ్యతులు నిర్వహించడం మనం గర్వించదగ్గ విషయమే.

జాతీయ స్థాయిలో   ఏమర్జేన్సిని తీవ్రంగా వ్యేతిరేకించి రాష్ట్రంలో జనతా పార్టీ నుంచి ఏకైక  అభ్యర్థిగా గేలిచిన నీలం సంజేవరెడ్డి స్వీకర్  గా  6వ  రాష్ట్రపతి గా నిర్వహించిన పాత్ర గర్వించదగినదే. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, రాష్ట్ర ముఖ్యమంత్రి గా, కేంద్ర హాంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాసు బ్రహ్మానందరెడ్డి, ప్రతేక తెలంగాణా ఉద్యమాన్ని నిర్వహించి రాష్ట్ర  జాతీయ రాజకీయాలను ఊపిన మర్రి చెన్నారెడ్డి, ఎన్.జి. రంగా, జలగం వెంగళరావు , తదితర ప్రముఖలు జాతీయ రాజకీయాలలొ ప్రముఖ పాత్ర పోషించారు.
ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు నిదానంగా రాజకీయాలు నిర్వహిస్తూ,  అవకాశం లబించినపుడు.  తెలుగువాడి సత్తా  నిరూపించిన ఘనత పి.వి. నరసింహారావు కే  దక్కుతుది . సాహితి వేత్త, మేధావి, భాహుభాషాకోవిదుడు , అపర చాణక్యుడు పి.వి. నరసింహారావు ఆర్ధిక సంస్కరణలను దేశంలో ప్రవేశపెట్టి చరిత్ర పుటల్లో అరుదైన స్థానం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ లో రాష్ట్ర నాయకులు గుర్తింపు కోల్పోవడం. అవమాన పాలుగావడం జరుగుతున్న సందర్భంలో  తెలుగువారి   ''ఆత్మాభిమానం''  నినాదంతో  తెలుగుదేశం,    నందమూరి తారక రామారావు మల్లీ డిల్లీ రాజకీయాల్లో ఆంధ్రులకు గుర్తింపు వచ్చింది. ఎన్. టి.ఆర్ .తో  కాంగ్రెస్ ప్రత్యాన్మాయ రాజకీయం  ''నేషనల్ ప్రంట్'' తెరపికి వచ్చింది. అధేవిదంగా కొత్త  తరం నాయకులకు కూడా   జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం లబించింది. 

ఈ సందర్భంలో  వివిధ రంగాలలో తమ పాత్ర  పోషించిన తెలుగువారిని కూడా గుర్తుకు  తెచ్చుకోకుండా ఉండలేం . సైనికదళాల  ప్రధానాధికారిగా  పనిచేసిన  జనరల్  కే.వి. కృష్ణారావు, ఎన్నికల కమీషనర్లుగా పనిచేసిన రమాదేవి, పేరిశాస్త్రి, జి.వి.జి.    కృష్ణముర్తి ,  ప్రణాలికా సంఘం సభ్యుడు  సి.హెచే. హనుమంతురావు,  కేంద్ర కేబినేట్ సేక్రటరీ గా పనిచేసిన టి. ఆర్.ప్రసాద్, గ్యాస్ అథారిటి అఫ్ ఇండియా చైర్మన్ గా సి.ఆర్ ప్రసాద్, హొంసేక్రటరీగా పద్మనాభయ్య , ఎయిమ్స్ డైరెక్టర్ గా  పి.వేణుగోపాలరావు మొదలైన వారెందరో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

కళారంగంలో  యామిని కృష్ణమూర్తి , రాధ రాజారెడ్డి, వనశ్రీ రామారావు, స్వప్నసుందరి పాత్ర కూడా తక్కవేమి కాదు. తెలుగు గడ్డ పై జన్మించి హిందీ చిత్ర రంగంలో కూడా తమ ప్రతిభను నిరూపించుకున్న వహీదా రహమాన్, శ్రీదేవి, జయప్రద నటనా వైదుష్యం  అందరికీ తెలిసిందే. జయప్రద రాజకీయ రంగంలో  సైతం ఉత్తరాదిన కూడా పోటీ చేసి విజయం సాధించారు.
జాతీయ స్థాయిలో తెలుగువారు కీలకమైన పాత్రలు పోషించి తమ ముద్ర ఏమిటో నిరూపించుకున్నారు. .   ఏరంగంలో నైన తెలుగువాడి సత్తాను ఇవాళ తక్కువ అంచనా వేసే ధ్యైర్యాన్ని  జాతీయ స్థాయిలో ఎవరు పదర్శించలేరని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

09 September 2011

శ్రీ కాళోజీ 98వ జయంతి మరియు మాండలిక భాషా దినోత్సవం!

ప్రజాకవి, 
స్వాతంత్ర్య సమరయోధుడు,  
పద్మవిభూషణ్,
శ్రీ కాళోజీ  నారాయణరావు గారి  98వ జయంతి 
మరియు  
మాండలిక భాషా దినోత్సవం 

మానవుడికి పుట్టుకతోనే వచ్చే  మాండలిక భాషని  కాపాడుకోవలనేవారు, భాష రెండుతీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండు పలుకుబడుల భాష, నీభాషలోనే  బతుకున్నది - నీయాసలోనే సంస్క్రుతున్నది అనేవారు.

మన భాష, యాసలన్న అభిమానముండాలే  అనేవారు.ఆయన కవిత్వం-వ్యక్తిత్వం, రచనలు-చరణలు ప్రజల ఆకాంక్షలు-ప్రజా ఉద్యమాలకోసం కాళోజీ జీవించారు. 

 ప్రాంతాలకే   పరిమితమైన  ఈ మాండలిక  భాషా   నేటి ఈ అంతర్జాలం ద్వారా  ప్రపంచానికి చేరువ  చేసిన ఈ సాంకేతిక విప్లవానికి  మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ......
తెలుగుజాతికి  మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు .

జెరెమి జువిట్(Jeremy Jewett)విజిటింగ్ కార్డ్ తెలుగులో!

హైదారాబాద్ మహానగరంలో
అమెరికా కాన్సులేట్‌ .  
అక్కడ ఓ  అధికారి తెలుగులో  మాట్లాడుతున్నాడు . 
వింతగా చూస్తున్నారు , విశేషంగా మాట్లాడుకుంటున్నారు.
ఎవరుఆ అధికారి ఎందుకని వింతగా చూస్తూ మాట్లాడుతున్నారు. 

ఆయన అమెరికా వాసి. 
ఆయన  ఉద్యోగం  మహానగరంలో   ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో వైస్ కౌన్సెల్  మరియు వీసా అధికారి.
ఈ ఉద్యోగపర్వంలో ఆయన విధి తన మాతృదేశమైన అమెరికాకు ఇక్కడి నుండి వెళ్ళే యోగ్యమైన వాళ్ళను ఎన్నుకుని వాళ్ళకు వీసాలు ఇవ్వడమో ఇవ్వకపోవడమో! అందులోనూ తమ దేశభాష అయిన ఆంగ్లము గురించి ఆలోచించడమో లేదా పరీక్షించడమో తప్ప వేరే ఇతర భాష గురించో సంస్కృతి గురించో అస్సలు ఆలోచించనక్కర్లేదు కూడా!!! కానీ… 
ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎంత అమెరికా వాసి అయినా వృత్తి రీత్యా తనకు తెలుగు అవసరం కాకపోయినా ఆయన మమేకమవ్వవలసింది తెలుగు వాళ్ళతో కాబట్టి ఇక్కడి భాషను మాట్లాడగలిగితేనే ఇక్కడి వాళ్ళకు మరింత చేరువ కాగలమన్న తలపుతో ఆయన మన తెలుగు భాషని  నేర్చుకోవాలనుకున్నారు! ఆరు నెలలు అక్కడే తెలుగును అభ్యసించారు… చివరికి మన తెలుగువాడిలా మాట్లాడటం మొదలుపెట్టారు!
 
ఈయన తెలుగు ఉచ్చరణ కూడా మనవాళ్ళలానే ఉంటుందిట! తెలుగు చదవడం కూడా వచ్చట! జెరెమి జువిట్ విజిటింగ్ కార్డ్ కూడా తెలుగులోనే ఉంటుందిట!..

08 September 2011

సి.పి. బ్రౌన్ భారతీయుడా లేక తెలుగువాడా ..?

విశాల విశ్వంలో కొన్ని దేశాలలో  పుట్టినవారిని , మరికొన్ని దేశాలలో  స్థిరనివాసం  ఏర్పరుచుకొని  ఉన్నవారిని ఆదేశసస్థులుగా పరిగనిస్తుంటారు.
 
జాతిమాట సరేగాని పుట్టిన స్థలాన్నిబట్టి  అంటే   బ్రౌన్  భారతీయుడు. ఆయన కలకత్తా హుగ్లీ  నదీతీరంలో  1798నవంబర్  07తేదిన జన్మించాడు. 14ఏళ్ళు వచ్చేదాకా ఈ దేశం గాలిపీల్చాడు నీళ్ళు తాగాడు , ఇక్కడి  మట్టి తత్వాన్ని బాగా వోంటబట్టంచుకున్నాడు. 

14వఏట తల్లీ సోదరులతో పాటు ఇంగ్లాండు వెళ్ళాడు. అక్కడున్నది ఐదేల్లె 1817లో కుంఫినీ ఉద్యోగిగా తన  19వ యేట మళ్లీ మద్రాసులో అడుగుపెట్టాడు. మద్యలో మూడేళ్ళు లండన్ కి సెలవ్ మీద వెళ్ళటం తప్పిస్తే  మొత్తం  48సంవత్సరాలు భారతదేశం లోనే గడిపాడు . 

బ్రౌన్ బాల్యం , ఉజ్వల యవ్వనం , వృద్యాప్య ఆరంభం అన్ని ఇక్కడేగడిచాయి. న 57యేట పక్షపాత రోగంతో  భారతదేసాన్ని  శాశ్వతంగా  వదిలి వెళ్ళాడు .   బ్రౌన్  లండోన్ లో మరో  29ఏళ్ళు  బతికాడు. కాని అది శేషజీవితం, శేషజీవితమే ఆయినా ఇక్కడి సారస్వత వ్యాసంగం కొనసాగింపు తుదిశ్వాస దాక కోనసాగుతూనే ఉంది  .

1824 ప్రారంభం మాచలీపట్నంలో (అప్పుడాయనకు  26ఏళ్ళు)   ఉన్నాడు.  అప్పటికే బ్రౌన్ గారికి తెలుగు వాడుక భాషలో మాట్లాడగలుగుచున్నాడు. " హిందువుల ఆచారాలు - పండుగలు " అనే పుస్తకం మరియు పుస్తకంలో   వేమన ప్రసస్తి   బ్రౌన్ ను బాగా ఆకర్షించింది . వేమన గురించి వినడం. వెంటనే వేమన పద్యాల తాటాకు పుస్తకాల సేకరణకు ఉద్యమించిడం 16ప్రతులను సేకరించటం - అంగ్లానువదించడం. అన్ని మార్చిలో మొదలెట్టి నవంబర్ వరకు అంటే  9నెలలు ముగించడం. 

 ఆ రోజుల్లో చేదోడు వాదోడుగా తిప్పాబోట్ల వెంకటశివశాస్త్రి , అద్వైత  బ్రహ్మయ్యగార్లు ఉండేవారు . బ్రౌన్ అబిప్రాయాలలో  పండితుల ప్రభావం కొంతా కనిపిస్తుంది. తెలుగు రావాలంటే ముందు భారతం చదవమనేవాడట క్లాసిక్ చదివితే భాష వస్తుందనేవాడట. ఆయనకు మొదటనుంచి వాడుక  భాష పట్లే ముగ్గు చూపేవాడు ఆయన ప్రాణమంత వాడుకభాష పైనే ఉండేది . ఈ అభిమానం వల్లనే బ్రౌన్ డిక్షినరీ లో ఆర్థాలు ఎక్కువగా వ్యావహారిక భాష లోనే ఉంటాయి.

బ్రౌన్ స్థానికులతో ఎప్పుడూ కలిసేవాడు. స్థానికులను అర్థం చేసుకోవాలన్న తపనే కాని 
తనవర్ణ అహంకారాన్ని ఎక్కడా  పదర్శించిన దాఖలాలు   కనిపించవు.1833లొ  నందన  కరువు కాలంలో చీఫ్ సెక్రటరీకి పంపిన  నివేదికలో  scrcityఅనేమాట వాడకుండా  famineఅని యదార్థ పరిస్థితిని రాసినందుకి  చీవాట్లు తిన్నాడు. వంచన శిల్పంతో కూడిన పాలనభాషలో రాయకపోవడం  బ్రౌన్ నిజయితీకి నిదర్శనం.  To benefit the hindhus was my primary objective  అని రాసుకున్నాడు.  

బ్రౌన్  1873లో  తన సాహిత్య జీవితాన్ని సింహవలోకనం చేస్తూ మొదటి ముద్రణ ఒక బాల్య ప్రయత్నంగా (జువేనిలే ఎఫ్ఫోర్ట్ / juvenile effort ) వర్ణించుకున్నాడు. మలి ముద్రణలు  మరియు 20ఎళ్ళ సాహిత్య, అభిరుచి, ఆశయ , లక్ష్యాల  పలితాలను గురించి  తృప్తిని అసంతృప్తిని వినయంగా చెప్పుకున్నాడు.

బ్రౌన్ చేసిపోయిన  ఉపకృతికి తెలుగునాడులో  ఒక ఊరు ఊరుకే  ఆయన పేరు పెట్టుకోవచ్చు. ఆయితే ఒక ఉన్నతమైన లైబ్రరీని కుడా ఆయన పేరుమీద నెలకొల్పలేకపోయము. ఈ సమయంలో  తమిళ సారస్వత కి  ఎ కొద్దిగా  ప్రయత్నం  చేసియున్న  ఈప్రపంచానికి   తెలిపె  ప్రయత్నంలో  బ్రౌన్  పాటికి  ఎ  ఆకాశానికి  ఎత్తియుండేవాళ్ళు.

బ్రౌన్ ఎప్పటికితీరని   సాహిత్య పిపాస , చిత్తసుద్ధి , నిస్వార్తపర్వతం  నేర్చుకోవలిసిన లక్షణాలు .

ఈ లెక్కల ప్రకారం బ్రౌన్ ను  మరోసారి  " భారతీయుడు " అనాలనిపిస్తుంది . భారతియుడే కాదు ' తెలుగు వాడు ' అని కుడా అనాలనిపిస్తుంది. తన జీవితంలో అత్త్యధిక సమయాన్ని , సంపాదనని , మేథనూ, పరిశ్రమను సర్వం, తెలుగు  సారస్వత   పునరుద్దరనకే   వేచించిన  త్యాగశీలిని  తెలుగువాడు  అంటే అది మన గౌరవంకోసమేగాని  ఆయనకు ఒరిగేదేమిలేదు .

07 September 2011

ఎవరనుకొన్నారీ తెలుగు వాడు ?

సృష్టికి ప్రతి సృష్టి చేసి,  వసిష్టుని కెదురు ప్రశ్నేవేసిన 
రాజుగా , రాజర్షిగా,   బ్రహ్మర్షిగా పై కెదిగిన
అల విశ్వామిత్రునకు ఆదర్శ కుమారుడు 
భరుతునికి సహజన్ముడు,
భారత సామ్రాజ్యరాజ  పదవికి వారసుడు.

ఒక  బ్రహ్మయై  - కాల జ్ఞానం  
ఒక బ్రహ్మనయై  - సమాజవాదం  
ఒక వేమనయై  - వేదసారం
ఉర్వికి బోధించినోడు  
సిద్దేంద్రుడై " కూచిపూడి " శివనాట్యం చేసినవాడు.

కాకతీయ సామ్రాజ్యం   " ఘనం "  ముగా  పాలించినవాడు ..
విజయనగరంనందు    " భువనవిజయం" సాధించినాడు


తెలుగుపాట అరువనోట పలికించిన వాడు
త్యాగయ్య.
భారత రాజ్యాంగ గీత ప్రవచించెన వాడు
అల్లాడి కృష్ణయ్య.
త్రివర్ణ పతాక రేఖలు తీర్చెన వాడు
పింగళి వెంకయ్య.


భాష స్వాతంత్రోద్యమంలో సమరాలు చెసినవాడు
గిడుగు రామమూర్తి  పంతులు.

గుండెను మరాతుపాకీకి కి గురి చూపెన వాడు

టంగుటూరి వీరేశలింగం పంతులు.

 
విల్లమ్ములతో పిరంగి గుళ్ళనడ్డే న వాడు
అల్లూరి సీతారామరాజులు.


దేశమంటే  " మనుషు "లని
జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు
గురజాడ అప్పారావు .
తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు
"నేను సైతం ప్రపంచాగ్నికి   సమిధ నోక్కటి.." అన్నాడు
శ్రీ శ్రీ /  శ్రీరంగం శ్రీనివాసరావు

ఆరంభ శూరుడనే

అపవాదుకు గురైనోడు
అనుకున్నది కాకుంటే
అందరిపై అలుగువాడు.

ఇల్లుదాటి ఎల్లదాటి

ఎల్లజగతి తిరిగినొడు
ఏదేశమేగినా....
సొంతూరు మరువని వాడు
పాతతగువలు వదలని వాడు.

ఎవరనుకొన్నారీ   తెలుగువాడు.
పరపాలన వదిలిన 
పరభాషను వదలనివాడు
మా పెద్దోళ్ళు మా చిన్నోళ్ళు
మా వారసులు తెలుగు వాళ్ళు ....

06 September 2011

తెలుగు భాష ప్రమాదంలో ఉందా..? తెలుగు జాతి ప్రమాదంలో ఉందా..?

తెలుగు భాష ప్రమాదంలో ఉందా ?   తెలుగు జాతి ప్రమాదంలో ఉందా  ?
తెలుగులేని జాతిని ఎమనీ పిలవాలి ?

ఆంగ్లేయులపాలనలో నాణేలమీద   కనిపించిన తెలుగు ..  
తెలిగీయులపలనలో పెదాలమీద కనిపించకపోతుంటే...... 
చుస్తుంటారా....చూస్తూనే ఉంటారా.... రండి..  కలసిరండి...  కదిలిరండి ....
 
తెలుగు భాష రక్షణకై సైనికులలా - తెలుగుజాతి పక్షానికై సేవకులలా !
తెలుగువీర మిత్రుల్లారా .  
పొట్లూరి హరికృష్ణ : 0 99 080 57 895


తెలుగు రక్షణ వేదిక :   జెండా :


తెలుగు రక్షణ వేదిక :  ఆశయ - లక్ష్యాలు :


05 September 2011

గురుదేవులకు పాదాభివందనాలు...!

సంస్కృతంలో  ' విద్ ' ఆనే ధాతువు  '' విద్య ''  ఆనే  పదానికి మూలం . తెలియుటని ఈ పదానికి మౌలికార్థం కాబట్టి ,  తెలియదగిన  ఏ అంశమైన ''విద్ద్యే ''  ఆతుంది . 

విద్య : శీలనిర్మాణం, నిర్మాణానికి కావలసిన పద్దతులన్నీ వివరించడం. వ్యక్తిత్వనిర్మాణం,   ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ నిగ్రహాన్ని కలిగించడం . ధర్మ పరిజ్ఞానాన్ని  మత పరిజ్ఞానాన్ని కలిగించడం. సాహిత్య , సంస్కృతిని రక్షించి  వ్యాప్తి చెందించడం . సాంకేతిక , సాంఘీక విధులను నిర్వహింపచేయడం.సామాజికాభివృద్ధిని  కలిగించడం. విద్య బోధనా లక్ష్యాలుగా , దేశకాల పరిస్థితుల ననుసరించి విద్య, బోదనలోను స్వరూపం మార్పు చెందుతుంటుంది .  

విద్య స్థాయీని పెంపొందించడానికి తల్లిభాషల అవసరముందని  తద్వారా దేశాభివృద్ధిని సాదించొచ్చని   కొఠారి కమీషన్ భావించింది . ప్రాంతీయ భాషల ఆభివృద్ధి యొక్క  అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు C.I.I.L(central institute of indian languages)ని నెలకొల్పారు.

ఉపాద్యాయులు పిల్లలోని సృజనాత్మకత శక్తిని వెలికితీసి వారి  ఊహలకు జీవం పోసే, వీరి బతుకుకు బంగారుబాట వేస్తారు . విద్యావేత్తలు , శాస్త్రవేత్తలు, డాక్టర్లు , ఇంజనీర్లు , లాయర్లు , ఇలా ఎందరో జాతి నిర్మాతలను ఈ సమాజానికి  అందిస్తారు ....

29 August 2011

గిడుగుతాతకు జేజేలు - పిడుగుతాతకు జేజేలు


గిడుగు తాత
ఆగస్టు 29న 1863లో శ్రీకాకుళం జిల్లా వం
శీదార తీరాన  పర్వతాలపేటలో జన్మించారు. తెలుగుభాషకు ఆయన చేసినసేవలకు గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన దేశంలో తోలి భాషశాస్త్రవేత్తగా పేర్కొనవచ్చు .



 

మాటకు రాతకు తేడావోద్దని ,పండితభాషను ఆటక్కేంచిన, ప్రజల వాడుకభాషకు  వెలుగును పంచిన వ్యావహారిక భాషోద్యమ పితామహుడు  
         గిడుగుతాతకు జేజేలు ''  మన ''   పిడుగుతాతకు జేజేలు 
1910వ సంవత్సరం నుంచి ఆధునిక సాహిత్యంలో గిడుగు యుగమని నిడిదవోలు వెంకటరావు గారన్న మాటలు అత్యంత యదార్థం.
1914లో మద్రాసు విశ్వవిద్యాలయమలో వాడుకభాష విషయంలో ఇచ్చిననుమతి  ఉపసంహరించుకున్న పంతులువారు నిరు త్సాహపడలేదు.
తనప్రయత్నం తనమాట సత్యమని,న్యాయమని,ధర్మమని ఆత్మవిశ్వాసతో  బలంగానమ్మేవాడు.
1914వ సం,, కాకినాడలో జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తులో గిడుగు మాట్లాడుతుంటే ఎద్దేవాచేసారు. 1915వ సం,,   రాజమండ్రిలో పంతులు మాట్లాడే భాషలో అల్లరి చేసారు .ఆనాటి పండిత ప్రముకులు.  ఆయన వాదం వినిపించడానికే ఆసరా లేకుండా చేసారు. 
అటువంటిది 
1933లో సప్తతి జన్మదినోత్సవం రాజమండ్రిలో 3రోజులపాటు  జీగీయమానంగా జరిగింది .ఆయన వాదాన్ని స్థాపించి వివరించే ఆయన రచనలు అందంగా అచ్చువేసి వెండి పెట్టెలో పెట్టి సభలో కానుకగాఇచ్చారు అదితన  వాదానికి విజయంగా ఆయన చాలా సంతోషించారు . 
1916వ సంవత్సరం కొవ్వూరులో జరిగిన ఆంధ్ర సాహిత్య ఆయన   వాదానికి  అనుకూల్యం సంపాదిన్చుకోగాలిగారు. 
1924లో తణుకులో జరిగిన పరిషత్తులో ఆయన 5గంటలపాటు  ఉపన్యసించి పండితులచేత ఒప్పించారు.ఒక తీర్మానం  కూడా చేఇంచారు.
 భావ ప్రకటనకు వాడుక భాష సరైన వాహిక నమ్మిన మహా మనిస్సాయన. రామూర్తి పంతులు  స్వయంకృషి చేత  మహాపండితుడైనాడాయన. పర్లాకిమిడి రాజకుమారుడికి విద్య బుద్దులు నేర్పారు . ఇంటిదగ్గర  ట్యూ షన్ చెప్పేవారు . రాజు కబురు పంపిన సున్నితంగా తిరష్కరించారట . రాజు దురాచార దుష్టమైన ఆనవాయతీలను నిలదీస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
కాలం హ్రుద చేయడంఏమాత్రం ఇష్టం ఉండేదికాదు.రోజులో సగబాగం చదువ్తునో , రాస్తునో పరిశ్రామించేవారు.  పాఠశాల పట్యంశాలు పటాలు భోదించడంలో ఆమితశ్రద తీసుకునేవారని. గంటకోట్టడం కూడా వారికి తెలిసేది కాదని ,ఆ తరువాత క్లాసు చెప్పాల్సిన ఉపాద్యాయులు  చెప్పాడని బయపడి ఆవైపు వచేవారు కాదట . అందువల్ల ఒక్కొక్కసారి   2గంటలు 3గంటలు వారి క్లాసులు సాగేవి అని,  కాళ్ళకూరి సూర్యనారాయన రావు గారు, తాపీ ధర్మారావు గారు, టేకుమళ్ళ కామేశ్వరావు గారు మొదలైనవారు పంతులుదగ్గర  చదువ్కున్నోల్లు వారికి సన్నిహితంగా ఎరిగినవారు రాసారు .
 సుమారు 20 సంవత్సరాలు సవరుల సామాజిక వికాసం కోసం కృషిచేసిన పంతులు వారి విద్యాభివృదికోసం  కృషిచేసారు .పాఠశాల  నిర్వహించారు , ఉపాద్యయులను నియమించారు ,వాళ్ళ బడులకోసం వాచక పుస్తకాలను ప్రకటించారు .

ఆయన ఇంట్లో ప్రతి రోజు వారాల పిల్లలు బొంచేసేవారు . తేలికచర్ల వెంకటరత్నంగారు వారింట్లో  చదువ్కున్నారు.వెంకటరత్నం ఈడు వాడైనా గోపీనాథ్ బెహర అనే  క్షురక కుటుంభానికి చెందిన కుర్రోడు పంతులు గారి  ఒద్ధికలో చదువ్కున్నాడు. ఆవిద్యార్థికి స్కాలర్షిప్ ఇప్పించి పైతరగతులు చదివించారు .అతడు తహసీల్దరై, అటు తరువాత ఓడిశాలో కలేక్టార్ పనిచేసి దివాన్ కుడా అయ్నాడట.
1895వ సంవత్సరం దాక పంతులుగారికి తెలుగు భాష సాహిత్యాలతో పరిచయం లేదు . ఆ  సంవత్సరంలో వచ్చిన వీరేశలింగం పంతులుగారి  హరిచంద్ర నాటకంలోని పద్యాలూ ఆయనకు ఆర్థం కాక కళాశాల పండితులను ఇంకా తెలుగులో పరిజ్ఞానం ఉన్నవారిని ఆదిగేవాదట . 
1903వ   సంవత్సరం పార్లకిమిడిలో  రాయసంవెంకటశివుడుగారు  కొన్నాళ్ళు పని చేసారు .  వెంకటశివుడుగారు ఆ రోజుల్లో తెలుగు జమాన పత్రిక నడిపేవారు . ఆ   పత్రికకు పంతులుగారిని ఒక వ్యాసం వ్రాసి ఎవల్శింధిగా కోరగా పంతులుగారు '' బిడ్దల - శిక్షణ '' గూర్చి గ్రాంధికంలో వ్రాసి అందులో ఎమైన దోసాలు లోపాలు చుదమన్నాడట .  కానిఎప్పుడయితే వ్యావహారిక భాషోద్యమాన్ని భుజాన వేసుకోన్నారో తెలుగులో పాండిత్యం సంపాదించారు .
తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 
1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుటా ్టరు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు.
ఈ సందర్భం లో వారికి నివాలర్పిస్తూ  తెలుగుభాష పరిపుష్టికి, పాలనలో తెలుగుకు తమవంతు భాద్యతను నిర్వర్తిస్తూ తెలుగు రక్షణ వేదిక ప్రజలభాషకు పునరంకితమౌతుంది .
                            గిడుగుతాతకు జేజేలు ''  మన ''  పిడుగుతాతకు జేజేలు  
                                      తెలుగు భాషకి జేజేలు - తెలుగు జాతికి జేజేలు.

e - తెలుగుబాట ఈనాడులో


27 August 2011

ఆధ్యక్షా ..!








ప్రజాస్వామ్యమంటే - ప్రజలకోసం ప్రజాపాలన , ప్రజల  బదులు  వాళ్ళ ప్రతినిధులు పలిస్తారు . 
మరిలాంటి ప్రభుత్వం తమప్రజలతో నిత్యం సజీవసంబంధం నేరపటానికి ప్రజలభాషనే తనవ్యవహారాలకి పూర్తిగావాడాలి. అందుకే అన్నారు - - - -
శిశువుకి తల్లిపాలు ఎంత శ్రేష్టమో , ప్రాణప్రదమూ, ప్రజస్వామ్యపుష్టికి ప్రజలభాష వినియోగం అంతే అవసరం మరి ,
మన రాష్ట్రములో 88% ప్రజలకు మాతృభాషా తెలుగు . తెలుగులో వ్యవహారాలన్నీ నడిస్తే అది ప్రజాప్రభుత్వం అవుతుంది . లేకపోతే ప్రజవేతిరేక ప్రభుత్వం అవుతుంది.
ఈనాటి ప్రభుత్వ కార్యాలయాలలో సగానికి సగం కూడా తెలుగులో జరగడం లేదు. 
ముఖ్యన్గా  రాజధానిలో ఉన్న సచివాలయం , శాఖదిపతుల కార్యాలయాలలో  తెలుగు వాడకం నామమాత్రమో, శున్యమో అందరి  అనుభవంలోని విషయం. 

1966లోనే అధికార భాష చట్టం వచ్చి తెలుగును రాష్ట్ర అధికారభాష ప్రకటించినా, ఆ చట్టాన్ని అనుసరించి ఐయదారు అధికారభాష సంగాలు పర్యవేక్షిస్తూ కొంత ప్రయత్నం చేసిన సాధించింది తక్కువ - సాధించల్శింది ఎక్కువ .సుమారు నాలుగున్నర దశాబ్దాలు కాలం కూడా ఈ ఆచరణకి నోచుకోకపోవటం - పాలకుల స్వభిమానరాహిత్యం, ప్రజల ఉదాసేనతకు కారణాలుగా పేర్కొనాలి 
అధికారభాష లక్ష్యం సాధించడానికి ప్రతివొక్కరు కృషిచేయాలని తెరవే గౌరవసూచన విజ్ఞప్తి .

15 August 2011

భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....


జాతి స్వేచ్చ కోసం సుమారు ముడువందలల్యేల్ల బానిసత్వం నుంచి
స్వాతంత్ర్యపు నగవుల్ని మనకందించిన సమరయోధులందరికి వందనాలు 
పాదాభివందనాలు.... || 2 || 
తమ తమ ప్రాణాల్ని బలిచ్చి మనకందించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యపు నగవుల్ని- కాపాడుకుందాం - 
తరతరాలకు అందిద్దాం || 2 || 
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..... !

03 April 2011

జగజ్జేతకి అభినందనలు.

సమయోచిత నిర్ణయాలతో  సమిష్టి కృషితో  
ప్రపంచ కప్‌ సాధించిన జగజ్జేత  భారత జట్టుకు అభినందనలు .  

08 March 2011

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ మనసు:
నువ్వు మొదటిసారి గర్భాన కదలినపుడు పరమానందం కలిగింది.
-నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.
-ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.
-నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.
-అందరికంటే బలవంతుడివవ్వాలని!
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.
-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.
-గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.
-నేను లేకపోయినా బ్రతకగలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.
-నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది.
-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!
ఇది చదివినప్పుడల్లా ఎందుకో నాకు అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి.....!

14 February 2011