14 January 2012

'సంక్రాంతి' పండుగ - పూర్వోపరాలు

మన సనాతన ఆచారాలు , సంప్రదాయాలు  మానవజాతికి జీవం , సత్యవాక్కు ధర్మాచారణే  విజయానికి మూలం . పండుగలు చేయడంలో పరమార్థం ఆధ్యాత్మికత, చారిత్రాత్మక, ఆరోగ్య విషయాలు అంతరార్థంగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులుగా భోగి , సంక్రాంతి , కనుమ పండుగ ఆంధ్రులు చేసుకొనే పెద్ద పండుగుల్లో ఒకటి.
సంక్రాంతి అంటే సంక్రమణం , మార్పు , సంచారం అని అర్థం .
 సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిననపుడే ధనుర్మాసం మొదలైనట్లే - దాన్నే నెలపట్టడం అంటారు. పండుగ సందడి  ప్రారంభం. నెల పొడవునా సంక్రాంతి సందడే. సూర్యభగవానుడు మేషాది పన్నెండు రాశుల్లో ఒక్కోనెల ఒక్కొక్క రాశి వంతున ప్రవేశించి సంచారం చేస్తాడు.ధనురాశి నుండి మకరరాశిలోకి మారిన తరుణమే మకరసంక్రాంతి ఉత్తరాయణ పున్యకాలం ఆరంభం. ధనుర్మానంలో మృగశిర నక్షత్రంతో కూడినా మార్గశిరం పుష్య మాసాలు రెండు కలుస్తాయి.( ఇది ఇంచుమించు డిసెంబర్15 నుండి జనవరి15 వరకు )  రాశి మార్పులన్నీ  సంక్రమణాలే  అయినా మకర సంక్రాంతినే పండుగగా చేసుకుంటున్నాం. ఎందుచేతనంటే మకర సంక్రాంతికి నరకయాతనలన్ని పోయి వర్గద్వారాలు తెరుచుకుంటాయని హిందువ్వుల  విశ్వాసం . పుణ్యకార్యాలు జరిపే ఉత్తమకాలమే ఉత్తరాయణమనటం వాడుక.
సంక్రాంతి మాసంలో చేసే స్నాన, దాన, జపదాన్యలకేంతో విశేషఫలం దక్కుతుంది. ఆ నెలలో చేతనైన దాన,  పుణ్య కార్యాలు చేయాలి. పితృ దేవతల్ని స్మరించుకొని వారి దీవెనలు తీసుకోవాలి.

ఈ సంక్రాంతిని బొమ్మల పండుగ, ముగ్గుల పండుగ, గొబ్బిళ్ళ పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ, ఇంకా  హాస్యానికి  అల్లుళ్ళ పండుగ అని కుడా అంటారు.ధనలక్ష్మి , దాన్యలక్ష్మి , పోషించే పౌష్యలక్ష్మి చల్లగా చూడమ్మా .. సస్యలక్ష్మి  అంటూ రైతులు పకృతిని , పంటచేలను ఆరాదింకుంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాలలో వారి వారి ఆచారాలతో, పద్దతులతో, ఆచరించడం పరిపాటి. సంక్రాంతి అనగానే బోగిపళ్ళు , బొమ్మలకొలువులు , పేరంటాలు , ముగ్గులు , గొబ్బిళ్ళు , బంతిపూల తోరణాలు , పాకలు, పందిళ్ళకి వేలాడే ధాన్యపు కంకులు , బళ్ళ నిండా చెరుకు గడలు , రేగిపళ్ళు గాదెల్లో కొత్త  ధాన్యాలు , సరదాగా అల్లుల్లతో  కూతుళ్ళతో పిన్న పెద్దలు హడావిళ్ళు , '' డూ డూ '' బసవన్నలూ, హరిలోరంగా అంటూ హరిదాసులు. శంఖం పూరించే జంగం దేవుళ్ళు, అంబ పలుకు జగదంభ పలుకు అంటూ బుడబ్బుక్కలోళ్ళు, వారి డమకరు నాదాలు , బోగి మంటలు  ఇలా పండుగ తెచ్చే హారెంతో!  గుర్తుకురాని వారుండరు . పల్లెటూర్లలో ఎడ్ల పందాలు , పొట్టేళ్ల పందాలు , కోడి పందాలు వినోదం కుడా తోడవతుంది. ఈ సంక్రాంతి పండుగ వేడుకలతో నిండి, కన్నులు కళకళలాడించే  లక్ష్మిశోభను తెలుగునాట ఏఇంట చుసిన సస్య లక్ష్మితో, గృహ లక్ష్మితో , దాన్యలక్ష్మితో కలసి ధనలక్ష్మి తాండవ మాడించే తెలుగు పండగ.

సంక్రాంతి ముగ్గులు ; సంక్రాంతి నెలపట్టిన దగ్గర నుండి ఆడవాళ్ళ సంక్రాంతి ముగ్గులు! సంక్రాంతి రథం, తాబేలు పద్మం అనీ ఇలా రకరకాల సంక్రాంతి ముగ్గులు, రంగురంగుల 'రంగవల్లిక' లతో పెట్టి కళానైపుణ్యమంతా తెలుగుగడ్డ మీద ఓలకబోస్తారు . ఈ ముగ్గుల పై గొబ్బిళ్ళు  పెట్టి తులసికోట వద్ద  ప్రమిదలతో ముగ్గుల మీద దీపాలు వెలిగించి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు .

గొబ్బెమ్మలు ;
గొబ్బిళ్ళతో భూదేవికి పూజ , భూగోళానికి ప్రతీకగా, ఆడపిల్లలు ఆవుపెడ తెచ్చి, దానితో గొబ్బిళ్ళు చేసి , వాటికి పసుపు కుంకుమ  అలంకరించి , పూలతో సస్యలక్ష్మిలా ఉన్న ఋతువును సూచించేందుకుగుమ్మడిపూలు గాని, బీరపూలు గాని, గొబ్బెమ్మలపై ఉంచి గొబ్బెమ్మల పాత పాడుతూ గొబ్బెమ్మలచుట్టూ తిరుగుతారు.  ఆనందం అంతా ఇంతా కాదు.   

బోగి మంటలు ;
బోగి పండుగ రోజు తెల్లవారుజామున ప్రతి ఇంటిముందు బోగిమంటలు వేస్తారు. ఈమంటలలో పాత అంతటిని తుడిచి పోగేసి తగలేసి  ''ధుని'' లేక యజ్ఞకుండమే  ఈ బోగిమంటలు. అంటే! పాతను విసర్జించి కొత్తకు స్వాగతం పలుకుతాయి. ఈ మంటలలో వేసిన గోమయంతో చేసిన గొబ్బి పిడకలు పొగ ఉపిరితిత్తుల వ్యాధిని నిరోధిస్తాయంటారు వైద్యులు. ఈ రోజు గొబ్బి పిడకలు మంట వద్ద శరీరమును కాచుకొని, నల్ల నువ్వుల ముద్దతో నలుగు పెట్టుకొని తలంటిస్నానం చేసి, కొత్తబట్టలు ధరించాలి. దగ్గరలో ఉన్న దేవాలయమునకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని, నల్ల నువ్వుల దానమివ్వాలి.

బోగిపళ్ళు;
బోగిరోజున బోగిమంటల్లాగే సాయంత్రం చంటి పిల్లలు ఉన్నవాళ్ళు పళ్ళెంలో  రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, పూలరేకులు కలపి పిల్లలకు దిష్టితీసి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపళ్ళు పోయించుకున్న చిన్నారులు  కలకాలం బోగబగ్యాలతో తులతూగుతారని మన పూర్వికుల నమ్మకమైన ఆచారం.  పసిపిల్లలకు తలపై రాగి దమ్మిడీలు (రాగి పైసలు) పెట్టి నుదుట, బొట్టు పెట్టి దీవించి ఈ బోగిపళ్ళు పోస్తారు.

మకర సంక్రాంతి; 
సూర్య సంచారాన్ని బట్టి, సూర్యుని ఉద్దేశించి చేసే పండుగ సంక్రాంతి పండుగ. ఈ రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభమవతుంది. పకృతిలో స్వష్ట మైన మార్పు వస్తునది. పౌస్య లక్ష్మి  ప్రకాశించగా పకృతి మాత కొత్త కాంతులతో  శోబిల్లుతూ, సూర్య భగవానుడు  దివ్య కాంతులు వేదజల్లుతుంటే,  కొత్తదాన్యం ఇండ్లకు రాగ, ప్రజలు సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటారు. దీనిని పెద్దపండగ అని, పెద్దల పండుగ అని అంటారు.  ఈ పండుగతో పాటు గతించిన పితృదేవతలకు తర్పణాలు వదిలి, పెద్దల ఋణాలనూ తీర్చుకునట్లు తృప్తి చెందుతారు.  ఈ పండుగ సుర్యభగవానుని  ప్రభావం చేత ఏర్పడే పండుగ కనుక సూర్యారాధనా ప్రదానం.       
సూర్యునికేదురురుగా  గృహ ప్రాంగణాన్ని ఆవు పేడతో అలికి , బియ్యపు పిండి , పసుపు కుంకుమలను కలపి అరవై  నాలుగు అంగుళాలు పరిణామం గల చక్రాన్ని వేసి మద్యలో ప్రద్మాన్ని వేసిదీనిని సూర్యచక్రంగాను , సూర్య నారయణుని గాను భావించి, పుష్పాలతో పూజించి, సుగంధ ద్రవ్య  గంధాక్షితులను చల్లి ధూప దీపాలను వెలిగించి, పొంగలిని నైవేద్యం పెట్టి కర్పూరహరతులనిచ్చి  సేవించాలి .
బ్రహ్మకల్పం ప్రారంభంలో ప్రళయం వచ్చి ఈ ప్రపంచ మంత జలమయమైనపుడు ఈ భూమి సముద్రంలో మునిగిపోయి కొన్ని సంవత్సరాలు అలాగే నీళ్ళ లో ప్రళయ స్థితిలో  ఉన్నపుడు శ్రీ మహావిష్ణువు  ఆది వరహారూపంలో ఈ భూమిని పైకి తెచ్చినది ఈ మకర సంక్రాంతి రోజునే. వామనావతార ఘట్టంలో వామనుడికి బలి మూడు అడుగుల నేలను దానం చేసింది ఈ పర్వదినం నాదే. బ్రంహాండమంతా తన రెండడుగులతో కొలచి , తన మూడవ పాదాన్ని బలి శిరస్సును మోపి అతడిని పాతాళానికి పంపినది కుడా ఈ మకర సంక్రమణపుణ్యకాలంలోనే.


కనుమ పండుగ;  మూడవ రోజున కనుమ ఇది పశువుల మూగ జీవాల పండుగ అవును మనం గోమాతను పుజిస్తాము. మానవ జీవన విధాన సరళిలో  పశువుల పాత్ర ప్రధానం . వ్యవసాయదులలో సాయపడి దేశమందలి   పాడిపంటలు అభివృధికి దోహదపడతాయి  పశువులు. పరోపకారమే ద్యేయంగా గల ఈ మూగ జీవాలను గౌరవించడమే ఈ పశువుల పండుగ ఏర్పాటు చేయబడినది. వ్యవసాయదారులు ఉదయమే పశువులును వేడి నీళ్ళతో శుబ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మేడలో  గంటలు కట్టి  కొమ్ములకు  పూలమాలలు కట్టి వాటిని పూజించి గోప్రధక్షణలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో విస్తట్లో భోజనం వడ్డించి వాటికి తినిపించి గుడికి తెసుకేళ్ళడం ఒక ఆచారం. ఈ విధంగా పశువుల పండగ నిర్వహించి   పశువుల రుణాన్ని తీర్చుకున్నట్టు  భావిస్తారు. కనుమనాడు మినుమలు తినాలని , లేకపోతే యముడు ఇనుమును కోరికిస్తాడని పూర్వికుల నమ్మకం.
అందుకే  ప్రతిఇంట ఈనాడు గారెల పిండి వంటలు తప్పక చేస్తారు.  కొత్త మంది స్త్రీలు తమ ఆచారాలుగా ఊరు పొలిమేరలో ఉన్న గంగమ్మ , పోలేరమ్మ మొదలగు గ్రామదేవతలకు నైవేద్యం సమర్పిస్తారు.  పురుషులు ఊరు పోలిమేర్ల్లలో మామిడి తోపుల్లో చేరి , కోడి పంద్యాలు , పొట్టేళ్ల పందాలు సరదాగా తిలకిస్తారు. కనుమ రోజున ప్రయాణం ఎవరు పెట్టుకోరు. కనుమ రోజున కాకి కుడా ఎక్కడ బయలు దేరదని పూర్వ సామెత . పెళ్ళీడు కొచ్చిన కన్నె పిల్లలు ఈ రోజున బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఈ పండుగకు పెట్టె గొబ్బిళ్ళున్నీ  ప్రతి రోజు  పిడకలుచేసి ఎండబెట్టాలి. తరువాత దండగుచ్చి అట్టే పెట్టి  మాఘ శుద్ధ సప్తమి  అదే రథసప్తమి నాడు ఈ పిడకలను వినియోగించాలి.

No comments:

Post a Comment