07 September 2011

ఎవరనుకొన్నారీ తెలుగు వాడు ?

సృష్టికి ప్రతి సృష్టి చేసి,  వసిష్టుని కెదురు ప్రశ్నేవేసిన 
రాజుగా , రాజర్షిగా,   బ్రహ్మర్షిగా పై కెదిగిన
అల విశ్వామిత్రునకు ఆదర్శ కుమారుడు 
భరుతునికి సహజన్ముడు,
భారత సామ్రాజ్యరాజ  పదవికి వారసుడు.

ఒక  బ్రహ్మయై  - కాల జ్ఞానం  
ఒక బ్రహ్మనయై  - సమాజవాదం  
ఒక వేమనయై  - వేదసారం
ఉర్వికి బోధించినోడు  
సిద్దేంద్రుడై " కూచిపూడి " శివనాట్యం చేసినవాడు.

కాకతీయ సామ్రాజ్యం   " ఘనం "  ముగా  పాలించినవాడు ..
విజయనగరంనందు    " భువనవిజయం" సాధించినాడు


తెలుగుపాట అరువనోట పలికించిన వాడు
త్యాగయ్య.
భారత రాజ్యాంగ గీత ప్రవచించెన వాడు
అల్లాడి కృష్ణయ్య.
త్రివర్ణ పతాక రేఖలు తీర్చెన వాడు
పింగళి వెంకయ్య.


భాష స్వాతంత్రోద్యమంలో సమరాలు చెసినవాడు
గిడుగు రామమూర్తి  పంతులు.

గుండెను మరాతుపాకీకి కి గురి చూపెన వాడు

టంగుటూరి వీరేశలింగం పంతులు.

 
విల్లమ్ములతో పిరంగి గుళ్ళనడ్డే న వాడు
అల్లూరి సీతారామరాజులు.


దేశమంటే  " మనుషు "లని
జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు
గురజాడ అప్పారావు .
తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు
"నేను సైతం ప్రపంచాగ్నికి   సమిధ నోక్కటి.." అన్నాడు
శ్రీ శ్రీ /  శ్రీరంగం శ్రీనివాసరావు

ఆరంభ శూరుడనే

అపవాదుకు గురైనోడు
అనుకున్నది కాకుంటే
అందరిపై అలుగువాడు.

ఇల్లుదాటి ఎల్లదాటి

ఎల్లజగతి తిరిగినొడు
ఏదేశమేగినా....
సొంతూరు మరువని వాడు
పాతతగువలు వదలని వాడు.

ఎవరనుకొన్నారీ   తెలుగువాడు.
పరపాలన వదిలిన 
పరభాషను వదలనివాడు
మా పెద్దోళ్ళు మా చిన్నోళ్ళు
మా వారసులు తెలుగు వాళ్ళు ....

1 comment:

  1. Hatsoff

    Very good post

    --- Peram Kirankumar Malaysia

    ReplyDelete