16 September 2011

మనసుతో పనిలేని ఓ యంత్రమా ఈ తెలుగు వాడు ..?

ఏ జాతి  సమస్త వ్యవహారాలూ ఆ జాతి మాతృభాషలో జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.ఎప్పటికి అది విజేతగానే ఉంటుంది. ఆంగ్లేయులను వాళ్ళ దేశాలను పరిశీలిస్తే దురాక్రమణత్వం వల్ల భౌతిక సంపదలు సమకురాటమేకాక వారి భాష కూడా వాళ్ళ ఆక్రమించిన దేశాల్లో రాజ్యం ఏలింది . ఏలుతున్నది. తమ జీవితంలో అన్ని రంగాల్లో తమ మాతృభాషా వాడుకంలో ఉండేలా  వాళ్ళు కృషి చేస్తారు , ఇంట్లో , ఆఫీసులో , కోర్టులో చివరికి చర్చిలో కుడా వాళ్ళు మాతృభాషలోనే  వ్యవహారాలూ నడుస్తాయి . కాబట్టే వారి భాష వారు సుఖపడుతున్నారు. 

తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్న , ఆఫీసులో ఇంగ్లీష్ , కోర్టులో  ఇంగ్లీష్ , కొన్ని ప్రాంతాల్లో హింది లేదా ఉర్దూ మాట్లాడల్సివస్తుంది . చివరికి దేవుడి ప్రార్థన చేసుకుందామన్న సంస్క్రుతంలోనో , అరబ్బీ లోనో  చేసుకోవలసివస్తుంది . తెలుగు మనిషి  మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు .   తెలుగు  క్రైస్తవులు తమ ఆద్యాత్మిక వ్యవహారాలన్ని తెలుగులోకి మార్చుకోవడం వల్ల కనీసం మానసిక ఆనందాన్ని పొందగలుగుతున్నాడు.  తెలుగు  హిందువులు ,  తెలుగు ముస్లీంలు  మొదట తమ ఆద్యాత్మిక వ్యవహారాలను తెలుగులోకి మార్చుకోగలిగితే  తెలుగు హృదయం స్వేచ్చగా  పలుకుతుంది. దేవునితో మాట్లాడే భాష హొదా తెలుగుకు వస్తుంది.  ఆ ఆనందం వర్ణించలేనిదీ.

పూర్వ కాలంలో  మన  దేశంలోని   రాజులు  చక్రవర్తులు  తమ  తమ  మాతృ  భాషలలో  ప్రజలతో సంభాషించేవారు. ఆలాగే   ధైనందిన జీవిత వ్యవహారాల  పరిష్కారాల  విషయంలో కుడా మాతృభాషనీ ఉపయోగించడం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది .  ప్రజల భాషలోనే  కుడా రాజ్యపాలన సాగింది . ఎవరైనా  భాధితుడు  వచ్చి ధర్మ గంటను మ్రోగిస్తే ,  రాజు విచ్చేసి భాధితుడి   మొర  విని నిందితుడ్ని పిలిపించి  అందరి సమక్షంలో విచారించేవాడు.  అ విచారణలో  ఇరు పక్షాలు వాదోపవాదాలు  మాతృ భాషలో జరిగేవి.  తీర్పురి  అయన రాజుగారికి  ఫిర్యాది  - నిందితుడికి   మద్య మధ్యవర్తిగా  ఎ ''ప్లీడరు'' వుండేవాడు కాదు. 

రాజు విచారణ జరిగేటప్పుడు  ప్రజల  భాషలోనే   ప్రశ్నించి  వివాద  మర్మాన్ని  పసిగట్టేవాడు.  చివరకు ప్రజల భాషలోనే  తీర్పు   ప్రకటించే వాడు.  ఈ మేరకు అటు విచారణ  ఇటు తీర్పు   ప్రజల సొంత భాషల్లొ జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది  కాదు.  తీర్పు సొంత భాషలో రావడంతో పిర్యాదునికిగాని, నిందుతుడుకిగాని  అర్థం కానిదంటు ఎమి వుండేది  కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన  విధానంతో ఆనాటి పద్దతులను  పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది .

No comments:

Post a Comment