11 September 2011

జాతీయ స్థాయిలో తెలుగు వెలుగులు.!

ఏదేశంలోనైన  రాజకీయాలు అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి. ఎ ప్రాంతం వారి పాత్ర ఎంతని చెప్పడం కష్టం. చరిత్ర  కొన్ని బౌతిక కారణాల ద్వార ప్రభావితం అవుతుంటుంది. రాజకీయాలు చరిత్రలో భాగం. రాజకీయాలను కేవలం రాజకీయ నాయకులే ప్రభావితం చయనక్కర్లేదు. సాహిత్యం , సంస్కృతి , కళలు, ఉద్యమాలు మొదలైనవన్నీ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. తెలుగువారు విభిన్న రంగాలలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచారు. రాజకీయాలను కూడా ప్రభావితం చేసారు. 

తెలుగువారికి  విశిష్టమైన  అంశం  ఏమిటంటే  అంతర్జాతీయ స్థాయిలో  జరిగిన  పరిణామాలకు  దేశంలో మిగతా  వారందరి కంటే ముందు ప్రభావితమై స్పందించిన సందర్భాలు చాలా  ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో అభ్యుదయం మిగతా భాష సాహిత్యలకంటే ముందుగా జరిగింది. ఒక అభ్యుదయ విప్లవోద్యమాలే కాదు,  స్త్రీవాదం ముందుగా తెలుగు  సాహిత్యంలో చోటుచేసుకున్నట్లు కనపడుతుంది. దేశంలో వివిధ  ప్రాంతాలలో జరిగిన  ఉద్యమాలకు తెలుగువారు స్పందించి మరింత ముందుకు తెసుకేల్లిన సందర్భాలున్నాయి. బెంగాల్ లో ప్రారంభమైన సంఘ సంస్కరణొద్యమ ప్రభావం తెలుగు సాహిత్యంలో  కనపడుతుంది.  హిమాలయాలను వర్ణించిన అల్లసాని పెద్దన నుంచి - తాజ్ మహాల్  పడగోట్టండోయ్. రాయి రాయి  విడగోట్టండోయ్! అన్న ఆలూరి బైరాగి వరకూ తెలుగువారే. కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం వివిధ భాష  సంస్కృతులను ప్రభావితం చేసాయి.

దేశమంటే "మనుషు"లని జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు " నేను సైతం ప్రపంచాగ్నికి   సమిధ నోక్కటి....." అన్న శ్రీ శ్రీ. జ్ఞానపీట అవార్డు పొందిన విశ్వనాధ్ , సి.నా.రే తో పాటుమరెందరో తెలుగు రచయితలు జాతీయ సాహిత్యంలో స్థానం పాదించుకున్నారు. 
తెలుగు పాత్రికీయులు దేశరాజకీయాలను ప్రభావితం చేసేంత కీలక పాత్ర పోషించారు. సి.వై. చింతామణి, చలపతిరావు, కుందూరి ఈశ్వర్ దత్,  జి.కే. రెడ్డి ,  నార్ల వెంకటేశ్వరావులు జాతీయ స్థాయిలో  చేసిన  కృషి మరువలేం. 

స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్రను మనం గుర్తు చేసుకుంటే దేశ రాజకీయాలను  ప్రభావితం చేయగలిగింది అర్థం అవుతుంది.  అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా  భోగరాజు పట్టాభి సీతారమయ్య స్వతంత్ర సమరంలో  నిర్వహించిన పాత్ర  చరిత్ర  పుటల్లో రికార్డుయి ఉంది. ఆయన రచించిన భారత జాతీయ  కాంగ్రెస్  చరిత్ర  ఇప్పటికీ  కాంగ్రెస్   చరిత్రకు సంబంధించి  ప్రామాణిక  గ్రంధం.   ఎ.ఐ.సి.సి అద్యక్షుడైన కొండా వెంకటప్పయ్య కుడా ఆనాడే   తెలుగు వారి కోసం ప్రత్యెక రాష్ట్రం డిమాండు చేసేందుకు  మాంటేగ్-చేమ్స్ పర్డు  బృందాన్ని  కలిసారు.  

ఆంద్ర రాష్ట్ర  ప్రధమ ముఖ్యమంత్రి గా టంగుటూరి ప్రకాశం స్వాతంత్ర సమరంలో పాల్గొన్న తీరు , స్వరాజ్య పత్రిక సంపాదకుడుగా గాంధీజీ ప్రశంసలు అందుకున్న వైనం చరిత్రలో నిలిచిపోయింది.  జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య.  ఆంధ్ర పత్రిక  వ్యవస్థాపకులు కాశినాధుని నాగేశ్వరరావు , నైటింగేల్ అఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన సరోజినీ నాయుడు, ప్రముఖ తత్వశాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మరో  మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి,  పార్లమెంటులోనూ, ప్రజా ఉద్యమాలల్లోను  సమర్థమంతమైన పాత్ర పోషించిన  తెన్నేటి  విశ్వనాథం, జాతీయోద్యమంలో అగ్రశ్రేణి నాయకుడిగా గుర్తింపు పొందిన బాలగంగాధర్ తిలక్  పిలుపు ఇచ్చిన  హాంరూల్   ఉద్యమంలో పాల్గొన్న స్వామి రామాంద తీర్థ, రాజకీయ వేత్త, సాహిత్యవేత్త ,మాజీ కేంద్ర మంత్రి బెజవాడ గోపాలరెడ్డి , తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన      కవి ముఖ్దాం మొహియుద్దీన్, ప్రముఖ సంఘ సేవకురాలు  దుర్గాబాయ్ దేశ్ ముఖ్, కమ్యునిస్టు మార్క్రిస్టు పుచ్చలపల్లి సుందరయ్య , చండ్ర రాజేశ్వరరావు , గిరిప్రసాద్ , రావి నారాయణరెడ్డి , తరిమెల నాగిరెడ్డి , చేనేత రంగం కోసం జీవితాంతం కృషిచేసిన ప్రగడ కోటయ్య,  ప్రప్రధమ దళిత ముఖ్యమంత్రి , మాజీకేంద్ర మంత్రి  దామోదర్ సంజీవయ్య  ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లొ కీలక పాత్ర  పాత్ర   పోషించిన తెలుగు ప్రముఖులెందరి గురించో ప్రస్తావించవచ్చు. వీరిలో ఒక్కొక్కరి గురించి వివరించాలంటే అదొక చరిత్ర అవుతుంది. జాతీయ రాజకీయ పక్షాల అద్యక్షులుగా  భోగరాజు పట్టాభి సీతారమయ్య  నుంచి వెంకయ్య నాయుడు భాధ్యతులు నిర్వహించడం మనం గర్వించదగ్గ విషయమే.

జాతీయ స్థాయిలో   ఏమర్జేన్సిని తీవ్రంగా వ్యేతిరేకించి రాష్ట్రంలో జనతా పార్టీ నుంచి ఏకైక  అభ్యర్థిగా గేలిచిన నీలం సంజేవరెడ్డి స్వీకర్  గా  6వ  రాష్ట్రపతి గా నిర్వహించిన పాత్ర గర్వించదగినదే. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, రాష్ట్ర ముఖ్యమంత్రి గా, కేంద్ర హాంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాసు బ్రహ్మానందరెడ్డి, ప్రతేక తెలంగాణా ఉద్యమాన్ని నిర్వహించి రాష్ట్ర  జాతీయ రాజకీయాలను ఊపిన మర్రి చెన్నారెడ్డి, ఎన్.జి. రంగా, జలగం వెంగళరావు , తదితర ప్రముఖలు జాతీయ రాజకీయాలలొ ప్రముఖ పాత్ర పోషించారు.
ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు నిదానంగా రాజకీయాలు నిర్వహిస్తూ,  అవకాశం లబించినపుడు.  తెలుగువాడి సత్తా  నిరూపించిన ఘనత పి.వి. నరసింహారావు కే  దక్కుతుది . సాహితి వేత్త, మేధావి, భాహుభాషాకోవిదుడు , అపర చాణక్యుడు పి.వి. నరసింహారావు ఆర్ధిక సంస్కరణలను దేశంలో ప్రవేశపెట్టి చరిత్ర పుటల్లో అరుదైన స్థానం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ లో రాష్ట్ర నాయకులు గుర్తింపు కోల్పోవడం. అవమాన పాలుగావడం జరుగుతున్న సందర్భంలో  తెలుగువారి   ''ఆత్మాభిమానం''  నినాదంతో  తెలుగుదేశం,    నందమూరి తారక రామారావు మల్లీ డిల్లీ రాజకీయాల్లో ఆంధ్రులకు గుర్తింపు వచ్చింది. ఎన్. టి.ఆర్ .తో  కాంగ్రెస్ ప్రత్యాన్మాయ రాజకీయం  ''నేషనల్ ప్రంట్'' తెరపికి వచ్చింది. అధేవిదంగా కొత్త  తరం నాయకులకు కూడా   జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం లబించింది. 

ఈ సందర్భంలో  వివిధ రంగాలలో తమ పాత్ర  పోషించిన తెలుగువారిని కూడా గుర్తుకు  తెచ్చుకోకుండా ఉండలేం . సైనికదళాల  ప్రధానాధికారిగా  పనిచేసిన  జనరల్  కే.వి. కృష్ణారావు, ఎన్నికల కమీషనర్లుగా పనిచేసిన రమాదేవి, పేరిశాస్త్రి, జి.వి.జి.    కృష్ణముర్తి ,  ప్రణాలికా సంఘం సభ్యుడు  సి.హెచే. హనుమంతురావు,  కేంద్ర కేబినేట్ సేక్రటరీ గా పనిచేసిన టి. ఆర్.ప్రసాద్, గ్యాస్ అథారిటి అఫ్ ఇండియా చైర్మన్ గా సి.ఆర్ ప్రసాద్, హొంసేక్రటరీగా పద్మనాభయ్య , ఎయిమ్స్ డైరెక్టర్ గా  పి.వేణుగోపాలరావు మొదలైన వారెందరో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

కళారంగంలో  యామిని కృష్ణమూర్తి , రాధ రాజారెడ్డి, వనశ్రీ రామారావు, స్వప్నసుందరి పాత్ర కూడా తక్కవేమి కాదు. తెలుగు గడ్డ పై జన్మించి హిందీ చిత్ర రంగంలో కూడా తమ ప్రతిభను నిరూపించుకున్న వహీదా రహమాన్, శ్రీదేవి, జయప్రద నటనా వైదుష్యం  అందరికీ తెలిసిందే. జయప్రద రాజకీయ రంగంలో  సైతం ఉత్తరాదిన కూడా పోటీ చేసి విజయం సాధించారు.
జాతీయ స్థాయిలో తెలుగువారు కీలకమైన పాత్రలు పోషించి తమ ముద్ర ఏమిటో నిరూపించుకున్నారు. .   ఏరంగంలో నైన తెలుగువాడి సత్తాను ఇవాళ తక్కువ అంచనా వేసే ధ్యైర్యాన్ని  జాతీయ స్థాయిలో ఎవరు పదర్శించలేరని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment